మెడికల్ స్టోర్ యజమానుల ఆందోళనపై ఎస్మా
హైదరాబాద్: ఆందోళనకు దిగిన మెడికల్ స్టోర్‌ల యజమానులపై ఎస్మా ప్రయోగానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్)కు నిరసనగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు గత ఐదు రోజులుగా మెడికల్ స్టోర్‌లను మూసి వేస్తున్నారు. మూసి వుంచే దుకాణాల లైసెన్సులను రద్దు చేయడానికి, ఆందోళనకు దిగినవారిని అరెస్టు చేయడానికి ఎస్మా వల్ల అధికారం లభిస్తుంది. గత ఐదు రోజులుగా మెడికల్ స్టోర్‌లు బంద్ పాటిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మంగళవారంనాడు హైదరాబాద్‌లోని నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వద్ద ఉన్న మెడికల్ స్టోర్‌ను మూసివేయించడానికి కెమిస్టులు, డ్రగ్గిస్టులు ప్రయత్నించారు. ఈ సమయంలో తీవ్ర ఘర్షణ జరిగి ఉద్రిక్తత నెలకొంది. తోపులాట జరిగింది. కెమిస్టులు, డ్రగిస్టుల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తమపై దౌర్జన్యానికి దిగారని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందులను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రజల ఇక్కట్లను ఈ ఏర్పాట్లేవీ ఊరట కలిగించలేకపోతున్నాయి.












Click it and Unblock the Notifications