పత్రికలు నన్ను డిప్రమోట్ చేశాయి: వెంకయ్య
న్యూఢిల్లీ: తనకు సీనియర్ ఉపాధ్యక్ష పదవి ఇచ్చే విషయం ఏదీ లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. వెంకయ్యనాయుడుకు సీనియర్ ఉపాధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆ విధంగా ప్రతిస్పందించారు. అటువంటి విషయమేదీ ఉన్నట్లు తనకు తెలియదని ఆయన అన్నారు.
తనను పత్రికలు డిప్రమోట్ చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి నిర్ణయం ఏదీ జరగకుండా తనెలా ప్రతిస్పందించగలనని ఆయన ఎదురుప్రశ్న వేశారు. పార్టీ జాతీయ కార్యవర్గం మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, బంగారు లక్ష్మణ్, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications