ఆంధ్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: జయ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ధ్వజమెత్తారు. తెలుగుగంగ నుంచి తమిళనాడుకు దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆమె గురువారం శాసనసభలో అన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా ఆమె చెప్పారు.
తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి తమిళనాడుకు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ఇప్పటికే అధిక మొత్తంలో నిధులు ఇచ్చామని ఆమె చెప్పారు. గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, ఎం.జి. రామచంద్రన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడుకు యేటా 12 టియంసిల నీటిని అందించాల్సి వున్నదని ఆమె చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా అమలు చేయలేదని ఆమె విమర్శించారు.












Click it and Unblock the Notifications
