కొనసాగుతున్న నక్సల్స్ హత్యలు, విధ్వంసాలు
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సలైట్లు హింస కొనసాగుతూనే ఉంది. నాలుగు జిల్లాల్లో మావోయిస్టులు హత్యలకు, విధ్వంసానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లాలో మావోయిస్టులు తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాల్చి చంపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఆల్లాపురం గ్రామంలో సింగిరెడ్డి సత్తిరెడ్డి అనే టిడిపి నాయకుడిని వారు హత్య చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో కాంతయ్య అనే వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఆరుగురు సాయుధ నక్సలైట్లు చాలా సమీపం నుంచి కాల్చి చంపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సును దగ్ధం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎల్లంపేట గ్రామంలో గోపాలకృష్ణ అనే వ్యాపారిని మావోయిస్టులు చంపారు. గోపాలకృష్ణను, అతని తమ్ముడు రామచంద్రమూర్తిని అటవీ ప్రాంతానికి తీసికెళ్లి గోపాలకృష్ణను చంపేసి, రామచంద్రమూర్తిని వదిలేశారు.












Click it and Unblock the Notifications
