సాగునీటి ప్రాజెక్టుల ఫైళ్లు చూపించం: పొన్నాల
హైదరాబాద్: బహిరంగ చర్చ సందర్బంగా ప్రతిపక్షాలకు సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఫైళ్లను చూపించబోమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. అది పాలనాపరమైన అంశమని, ఇటువంటి విషయాల్లో ఫైళ్లు చూపడం సరి కాదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చట్టసభల పద్ధతులే బహిరంగ చర్చకూ వర్తిస్తాయని ఆయన అన్నారు. తాము ఏం చెప్పాలో అది చెబుతామని ఆయన అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారులో ఏ విధమైన అవినీతీ చోటు చేసుకోలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. వచ్చే ఆదివారం పదవ తేదీన జూబిలీహాల్‌లో తోటపల్లి ప్రాజెక్టుపై బహిరంగ చర్చ జరుగుతుందని, ఒక్కో రాజకీయ పార్టీ తమ ప్రతినిధిగా ఒక్కో సాంకేతిక నిపుణుడిని మాత్రమే పంపాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు వాటి ప్రశ్నలను శువ్రారంలోగా తమకు అందజేయాలని కూడా ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభలో చర్చించామని, తాము చర్చకు సమాధానం కూడా ఇచ్చామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
