చిదంబరం వద్ద వైయస్ కోరికల చిట్టా
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ముందు తన కోరికలను చిట్టాను విప్పారు. ఆయన చిదంబరంతో సమావేశమై రాష్ట్రం కోసం కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఆర్థిక కొలమానాలను తాము పాటించినందుకు అదనంగా 100 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన చిదంబరాన్ని కోరారు. కరువు సహాయం కింద రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాలని, నాగార్జున సాగర్ ఆధునీకీకరణకు 3 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
స్ట్రక్చురల్ అడ్జస్ట్‌మెంట్ కింద రాష్ట్రానికి 1600 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ రుణానికి సిఫార్సు చేయాలని కూడా ఆయన చిదంబరాన్ని కోరారు. శానసభ్యుల జీతాలను ఆదాయం పన్ను నుంచి మినహాయించాలని రాజశేఖర్ రెడ్డి చిదంబరాన్ని కోరారు. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులో ఎదరువుతున్న సమస్యలపై, ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చిదంబరంతో చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
