దర్శకుడు శ్రీను వైట్లపై నిర్మాత కేసు
హైదరాబాద్: దర్శకుడు శ్రీను వైట్లపై నిర్మాత జి.వి. అంజిరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. శ్రీను వైట్లపై మూడు నెలల క్రితం కేసు పెట్టినా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు ఆయను విచారించడం గానీ అరెస్టు చేయడం గానీ చేయలేదని అంజిరెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. శ్రీను వైట్ల అనుచరులు తనను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీను వైట్ల నుంచి తనకు ప్రాణ హాని ఉన్నదని ఆయన చెప్పుకున్నారు. తనను బెదిరించడానికి మెగాస్టార్ చిరంజీవి లాంటివారి పేర్లు కూడా శ్రీను వైట్ల వాడుకుంటున్నారని ఆయన చెప్పారు.
తన సినిమా దర్శకత్వం వహించడానికి శ్రీను వైట్ల తన వద్ద 15 లక్షల రూపాయలు అడ్వాన్సుగా తీసుకున్నారని, అయిత తనకు ఇచ్చిన మాట తప్పి వేరే సినిమాను శ్రీను వైట్ల ఒప్పుకున్నారని, ఆ రకంగా తనను శ్రీను వైట్ల మోసం చేశారని ఆయన చెప్పారు. నీ కోసం సినిమా ద్వారా శ్రీను వైట్లకు తాను అవకాశం ఇచ్చానని, దాన్ని కూడా విస్మరించి శ్రీను వైట్ల తనను మోసం చేయడమే కాకుండా తనను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. అడ్వాన్స్ తీసుకుని తనను మోసం చేశాడని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications