డిమాండ్లు తీర్చలేకనే నక్సల్స్ నేతలపై గురి: వివి
హైదరాబాద్: తొలి విడత చర్చల సందర్భంగా నక్సల్స్ నేతలు పెట్టిన డిమాండ్లను నెరవేర్చలేకనే ప్రభుత్వం వారిని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తోందని విప్లవ కవి, విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు వరవరరావు విమర్శించారు. అందులో భాగంగానే మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణను హతమార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన శుక్రవారం విలేకరులతో అన్నారు.
నక్సల్స్ నాయకులను హతమారిస్తే ఉద్యమం ఆగిపోతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మావోయిస్టు జిల్లా, రాష్ట్ర నాయకులను లక్ష్యంగా ఎంచుకుందని ఆయన అన్నారు. చర్చలు కొనసాగుతున్న తరుణంలోనే నాలుగు జిల్లాలో ఇటువంటి ప్రయత్నాలకు పాల్పడిందని, అయితే ఈ సంఘటనల్లో ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. అక్టోబర్ 30వ తేదీ నుంచి ప్రభుత్వం నక్సల్స్ నేతలపై గురి పెట్టిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications