మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు: వైయస్
న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. మరో నాలుగు నెలల వరకు మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చునని ఆయన శుక్రవారం విలేకరులతో అన్నారు. మరో నాలుగు నెలల వరకు మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చునని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. అందరికీ చెప్పే మంత్రివర్గాన్ని విస్తరిస్తానని ఆయన అన్నారు.
ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీర్వాదం వల్లనే రాష్ట్ర వార్షిక ప్రణాళిక అధిక మొత్తం నిధులతో ఖరారయిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై సోనియాకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications