చర్చల ప్రక్రియకు జనశక్తి ప్రతినిధుల గుడ్‌బై
హైదరాబాద్: చర్చల ప్రక్రియ నుంచి తాము వైదొలుగుతున్నట్లు సిపిఐ (జనశక్తి) ప్రతినిధులు చంద్రన్న, సిహెచ్. శ్రీనివాస్ రావు ఆదివారంనాడు ప్రకటించారు. మావోయిస్టు ప్రతినిధులు వరవరరావు, గద్దర్, కళ్యాణ్‌రావులు చర్చల ప్రక్రియ నుంచి వైదొలిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుల వైఖరుల్లోనూ పోలీసుల వైఖరిలోనూ మార్పు రాకపోవడంతో తాము చర్చల ప్రక్రియ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.
నక్సలైట్ సమస్య సామాజిక, రాజాకీయార్థిక సమస్యగా పరిగణిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కేవలం శాంతిభద్రతల సమస్యగానే పరిగణనలోకి తీసుకుంటోందని వారు ఆదివారం విలేకరుల సమావేశంలో వమిర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హింసాయుత చర్యలకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతోందని వారన్నారు. ఈ స్థితిలో చర్చలు జరగవని తేలిపోయిందని వారన్నారు.












Click it and Unblock the Notifications
