పోలీసులపై మంత్రి ఎమ్మెస్సార్ చిందులు
వరంగల్: దేవాదాయ శాఖా మంత్రి ఎం. సత్యానారాయణ రావు వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ స్టీఫెన్ రవీంద్రపై చిందులు తొక్కారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం వరంగల్ పర్యటనకు వచ్చారు. తాను చింతగట్టు అతిథి గృహానికి వచ్చేసరికి అక్కడ ఒక్క పోలీసు కూడా లేకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.
తన పర్యటన గురించి ముందే తెలియజేసినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఆయన ఆగమనం తర్వాత కలెక్టర్ శివశంకర్ వచ్చారు. కలెక్టర్ పనితీరును ఎమ్మెస్సార్ ప్రశంసించారు. పోలీసులపై మంత్రి ఆగ్రహంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు పోలీసులకు తెలియజేశారు. కొద్ది సేపటికి ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర రావడంతో సత్యనారాయణ రావు చల్లబడ్డారు.












Click it and Unblock the Notifications
