ప్రత్యక్ష రాజకీయాలకు ఇక సెలవ్: వెంకయ్య
న్యూఢిల్లీ: తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు. తాను ఇక ముందు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆయన ఆదివారంనాడు చెప్పారు. తన జీవితమంతా పార్టీని బలోపేతం చేయడానికే కృషి చేస్తానని, అది కూడా ఓపికున్నంత కాలం పని చేస్తానని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు కూడా తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.
తాను ఏ పదవికీ పోటీ లేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వరకు అన్ని పదువులూ నిర్వహించానని, ఇక చేపట్టాల్సిన పదవులేవీ లేవని ఆయన అన్నారు. అయితే ప్రధాని పదవి ఒకటి ఉందని, కానీ దాన్ని తాను ఆశించడం లేదని, ఆ పదవికి తగిన స్థాయి తనకు లేదనే విషయం స్పష్టంగా తెలుసునని, తన పరిమితులేమిటో తనకు తెలుసునని ఆయన అన్నారు. ప్రధాని పదవి చేపట్టే అర్హత, స్థాయి తనకు లేవని ఆయన అన్నారు. తనకు సంతృప్తికరంగా ఉందని ఆయన అన్నారు. తనకు ఏ విధమైన అసంతృప్తి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
