కాంగ్రెస్ తొత్తుగా మారిన డిజిపి: టిడిపి
హైదరాబాద్: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ స్వరణ్‌జిత్‌సేన్ కాంగ్రెస్‌కు తొత్తులా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నాయకుడు, కేంద్రమాజీ మంత్రి ఎస్ వేణుగోపాలాచారి శనివారం ఇక్కడ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో లబ్ది పొందిన మీనా, సీతాపతిరావు, స్వరణ్‌జిత్‌సేన్ వంటి అధికారులు ఇప్పుడు తెగబడి కాంగ్రెస్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. డిజిపి వంటి ఉన్నత పదవిలో ఉన్న స్వరణ్‌జిత్ సేన్ ఇలా దిగజారిపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆయన భార్య చేసిన శిశు విక్రయాల కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోడానికే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని వేణుగోపాలాచారి విమర్శించారు. స్వరణ్‌జిత్ సేన్ కాంగ్రెస్ సేవాదళ్‌లో చేరడం మంచిదని ఆయన ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications
