శుభా ముద్గల్‌వీసాకు పాక్ నో
న్యూఢిల్లీ:భారత్-పాక్ సంబంధాలుమెరుగవుతున్నప్రస్తుత తరుణంలో భార తకళాకారులకు ఊహించని పరిణామం ఎదురయ్యింది.ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలుశుభా ముద్గల్ సహా తొమ్మిది మందికివీసాలు జారీ చేయటానికి పాకిస్తాన్ నిరాకరించింది.దీంతో భారత సాంస్కృతిక సంబంధాలమండలి సౌజన్యంతో శుక్రవారం పాక్‌బయలుదేరి వెళ్ళాల్సిన సంగీతకారులబృందం ఆఖరికి పర్యటన రద్దు చేసుకోవాల్సివచ్చింది. వీరు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలలోప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. న్యూఢిల్లీలోని పాకిస్తానీహై కమిషన్ వీసా దరఖాస్తులను తిరస్కరించినట్లుతెలుసుకున్న శుభా ముద్గల్ ఇలా జరగడంచాలా నిరుత్సాహాన్ని కలిగించింది. ఇరు దేశాలుస్నేహ హస్తాన్ని అందించుకుంటున్న తరుణంలోఈ పరిణామం ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు.అయితే వీసాలను ఎందుకు నిరాకరించాల్సివచ్చిందో పాక్ అధికార వర్గాలు వివరించలేదనిఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications
