సోనియాతో తెలంగాణపై మాట్లాడనే లేదు: కెకె

హైదరాబాద్‌: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తాను తెలంగాణపై మాట్లాడలేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు స్పష్టం చేశారు. సోనియాతో తాను సంస్థాగత ఎన్నికలపై మాత్రమే మాట్లాడానని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు. తాను ప్రణబ్‌ ముఖర్జీని కూడా కలవలేదని ఆయన చెప్పారు. ప్రణబ్‌ ముఖర్జీని తాను కలవకున్నా కలిసినట్లు వార్తలు వచ్చాయని ఆయన అన్నారు.

తెలంగాణపై ఎవరూ మాట్లాడవద్దని ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు. తెలంగాణపై ఏమీ మాట్లాడవద్దని అనుకుంటూనే తాము మాట్లాడుతున్నామని, ఇది సరికాదని ఆయన అన్నారు. తెలంగాణపై మాట్లాడడం ద్వారా సున్నితమైన అంశాన్ని సంక్లిష్టం చేస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశాన్ని తాము సోనియా చేతుల్లో పెట్టామని, ఆమె ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారని, కమిటీ అభిప్రాయసేకరణ జరిపి నివేదిక సమర్పిస్తుందని, అందువల్ల తెలంగాణపై ఎవరూ మాట్లాడకపోవడ మంచిదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+