తప్పుకోవడానికి నేను సిద్ధమే: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకత్వాన్ని మార్చాలనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌యస్‌యస్) అధినేత కె.యస్. సుదర్శన్ చేసిన సూచనను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్వాగతించారు. తాను తప్పుకోవడానికి సిద్ధమేనని ఆయన పరోక్షంగా ప్రకటించారు. వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ తప్పుకొని యువ నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని సుదర్శన్ సూచించారు.
పార్టీ పనులు తాను పెద్దగా చేయడం లేదని వాజ్‌పేయి అన్నారు. ఈ విషయంలో తాను స్పష్టంగానే ఉన్నానని, అద్వానీ విషయంలో తానేమీ చెప్పలేనని, నిర్ణయం తీసుకోవాల్సింది అద్వానీయేనని, అది అద్వానీ ఇష్టమని వాజ్‌పేయి అన్నారు. సుదర్శన్ సూచన మంచిదేనని, తాను పార్టీ కోసం అంతగా పని చేయడం లేదని ఆయన అన్నారు. బిజెపి అధ్యక్షుడు అద్వానీ విషయంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది అద్వానీయేనని ఆయన సమాధానమిచ్చారు. బాధ్యతలు స్వీకరించడానికి యువ నాయకత్వం సిద్ధంగా ఉందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications
