గుజరాత్‌లో లాలూ కారుపై రాళ్లతో దాడి
సమాలియా: రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కారుపై భజరంగదళ్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి వెళ్లకుండా లాలూను అడ్డుకున్నారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోకి వెళ్లకుండా కూడా వారు అడ్డుపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను చుట్టుముట్టి పెద్ద యెత్తున గొడవ సృష్టించారు. దీంతో భద్రతా సిబ్బంది ఆయనను ఒక గదిలోకి తీసికెళ్లారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కారుకు నిప్పంటించడానికి కూడా వారు ప్రయత్నించారు. ఈ విషయాన్ని లాలూ వడదోరా విమానాశ్రయంలో విలేకరులతో చెప్పారు. నరేంద్ర మోడిని దించి గుజరాత్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్‌లో పోలీసు, పాలనా యంత్రాంగాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తనపై నరేంద్ర మోడి పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు.
ప్రమాద స్థలంలో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడడానికి నిరాకరించారు. వడదొర విమానాశ్రయంలో మాట్లాడుతానని ఆంతకు ముందు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
