సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 17 మంది మృతి
సామాలియా (గుజరాత్): అహ్మదాబాద్‌కు చెందిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఆగి వున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో 17 మంది మరణించారు; 80 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదం గుజరాత్‌లోని పంచమహల్స్ జిల్లా సామలియా సమీపంలో గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో జరిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్, అతని అసిస్టెంట్ శవాలతో పాటు మృతుల శవాలను వెలికి తీశారు.
ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో నాలుగు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లైన్‌మన్ తప్పిదమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నరేంద్ర మోడీ స్వయంగా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అహ్మదాబాద్, గాంధీనగర్, వడదోరాల నుంచి సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి 22 బస్సులను నియోగించారు.












Click it and Unblock the Notifications
