ప్రజల కోసం డిజైన్లు మారిస్తే గగ్గోలా?: వైయస్
అనంతపురం: ప్రజల అవసరాల కోసం ప్రాజెక్టుల డిజైన్లు మారిస్తే ప్రతిపక్షం గగ్గోలు పెడుతోందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ విమర్శలపై అన్నారు. అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం ముష్టూరు వద్ద ఆయన గురువారంనాడు హంద్రీ నీవా పథకం పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
శ్రీశైలం రిజర్వాయర్ 841 అడుగుల నుంచి నీరు తీసుకునే వెసులుబాటును కలిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు 854 అడుగుల ఎత్తు నుంచి మాత్రమే నీరు తీసుకునే వెసులుబాటు ఉండేది. హంద్రీనీవా నుంచి 2007 ఖరీఫ్ సీజన్ నాటికి మంచి నీరు అందిస్తామని, హంద్రీనీవా రెండవ దశ పనులను వచ్చే జూన్‌లో ప్రారంభిస్తామని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. త్వరలో కృష్ణా జలాల పంపకంపై ఏర్పాటయిన ట్రిబ్యునల్ సమావేశం జరుగుతుందని, అందువల్ల జలవివాదాలపై కర్ణాటకతో చర్చించే వీలు లేకుండా పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
