మహారాష్ట్ర ప్రాజెక్టులపై సుప్రీంకు వెళ్తాం: మారుతి
నిజామాబాద్: గోదావరిపై మహారాష్త్ర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుగుదేశం శాసనసభ్యుడు సానా మారుతి చెప్పారు. మహారాష్త్ర గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్త్ర అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్త్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకు తాము మద్దతు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మహారాష్త్రపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర జలసంఘం వద్దకు, ప్రధాని వద్దకు రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి బృందం వెళ్తే మంచిదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రయత్నాలను తేలికగా తీసుకోవద్దని, పరిస్థితి గంభరమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
