భార్యకు టికెట్ రానందుకు బాధ లేదు: సూరి
అనంతపురం: తన భార్య గంగుల భానుమతికి కాంగ్రెస్ టికెట్ రానందుకు బాధ లేదని తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడని అనుమానిస్తున్న మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి అన్నారు. ఒక హత్యాప్రయత్నం కేసులో గురువారం అనంతపురం కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి బోయ శ్రీరాములు గెలుపునకు తమ వర్గం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. దివాకర్ రెడ్డి తనకు సోదరుడిలాంటివాడని ఆయన అన్నారు. పరిటాల రవి హత్యతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. పరిటాల రవి కుటుంబ సభ్యులకు గానీ వారి అనుచరులకు గానీ తన నుంచి ఎటువంటి ముప్పు కూడా ఉండదని, ఆ గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
