వైయస్ మార్కు ఎన్నికలకు తయారు: టిడిపి
హైదరాబాద్: కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మార్కు ఎన్నిలను నిర్వహించాలని చూస్తోందని తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడియల్‌పి) ఆరోపించింది. శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రదర్శన నిర్వహించి కలుషితం చేసిందని ఆరోపిస్తూ టిడిపి శాసనసభ్యులు గాంధీ విగ్రహాన్ని పాలతో ప్రక్షాళన చేశారు.
కాంగ్రెస్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని టిడియల్‌పి ఆరోపించింది. టిడియల్‌పి కార్యాలయం నుంచి శాసనసభ్యులు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరాచాకాలంటూ చదివి వినిపించారు. కాంగ్రెస్ వందలాది మందిని చంపుతూ రక్తం చేతులో గాంధీ విగ్రహాన్ని కలుషితం చేస్తోందని వారు వ్యాఖ్యానించారు. వైయస్‌లాంటి ఖూనీకోరులుంటారనే స్వతంత్రం రాగానే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీ సూచించారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు కరవుతో అల్లాడుతుంటే కాంగ్రెస్ తమను తిట్టడంతోనే కాలం వెళ్లబుచ్చుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
