క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: బాబు
హైదరాబాద్: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ నెల 20,21 తేదీల్లో జిల్లా నేతలను ఎంపిక చేసే కార్యక్రమంపై సోమవారం ఆయన సమీక్షించారు. జిల్లా నేతల ఎంపికకు ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఒక్కో జిల్లాకు ఒక్కో నాయకుడిని పంపిస్తారు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే జిల్లా నేతలను, పార్టీ కార్యక్రమాలను అమలు చేయడంలో ఉదాసీనత ప్రదర్శించేవారిని మార్చే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది.












Click it and Unblock the Notifications
