తెలంగాణ కోసం ఉన్నతస్థాయిక కమిటీ: సిపిఐ సూచన
న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలను అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని వేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) సూచించింది. తెలంగాణపై తన వైఖరిని తెలియజేస్తూ సిపి ఐ ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలోని కమిటీకి సోమవారం ఒక లేఖ రాసింది. తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడి పోయిందని, అభివృద్ధిలో సమతూకం పాటించకపోవడం తెలంగాణ వెనకబడిపోయిందని సూచించినట్లు సిపి ఐ సీనియర్ నాయకుడు డి. రాజా విలేకరులతో చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ మండళ్లను పునరుద్ధరించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటే సమానాభివృద్ధి సాధ్యమేనని ఆయన అన్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, తద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సూచించినట్లు ఆయన చెప్పారు. 610 జీవోను చిత్తశుద్ధితో అమలు చేయాలని సిపి ఐ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
