వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడు ఉప ఎన్నికల్లో జయ పార్టీ విజయం
చెన్నై: ఉప ఎన్నికలు జరిగిన రెండు శాసనసభా నియోజకవర్గాలను అన్నాడియంకె తిరిగి గెలుచుకుంది. కాంచీపురం, గుమ్మిడిపూండి శాసనసభ నియోజకవర్గాలకు ఈ నెల 14వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సీట్లలోనూ పాలక పార్టీ అన్నాడియంకె విజయం సాధించింది.
కాంచీపురంలో అన్నాడియంకె అభ్యర్థి టి. మైథిలి 17 వేల ఓట్ల మెజారిటితో, గుమ్మిడిపూండిలో అన్నాడియంకె అభ్యర్థి కె.యస్. విజయకుమార్ 27వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంచీపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరునవుక్కరస్సు, గుమ్మిడిపూండికి ప్రాతినిధ్యం వహిస్తున్న కె. సుదర్శనం మృతి చెందడంతో ఈ రెండు సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!