నర్సింహుడు సినీ నిర్మాత ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: జూనియర్ ఎన్టీ ఆర్ నటించిన నర్సింహుడు సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నుంచి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆయన ఆత్మహహత్యాయత్నానికి పాల్పడ్డారు. లేక్‌వ్యూ పోలీసులు ఆయనను రక్షించి కిమ్స్‌లో చేర్చారు. ఆర్థిక సమస్యల కారణంగానే చెంగల వెంకట్రావు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకట్రావుపై ఆత్మహత్యా యత్నం కింద ఐపియస్ 309 కింది కేసు నమోదు చేశారు. తాను పాయకరావుపేట శాసనసభా సభ్యత్యానికి రాజీనామా చేస్తానని నిర్మాత చెంగల వెంకట్రావు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సినిమా వివాదం గురించి తననేమీ అడగలేదని, చంద్రబాబుతో తనకు విభేదాలు లేవని ఆయన చెప్పారు.
సొంత జిల్లాలో సినిమా విడుదల కాలేదనే బాధతోనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డానని చెంగల వెంకట్రావు అంటున్నారు. ఫైనాన్సియర్లను ఎవరినీ తాను మోసం చేయలేదని, అందరికీ వడ్డీతో సహా డబ్బులు చెల్లించానని ఆయన చెబుతున్నారు. నర్సింహుడు సినిమాకు అనుకున్నదాని కన్నా రెట్టింపు ఖర్చయిందని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెంగల వెంకట్రావును నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.యస్. రామారావు, సురేష్‌బాబు, తదితరులు పరామర్శించారు. చెంగల వెంకట్రావును తెలుగుదేశం నాయకుడు ఎస్. వేణుగోపాలాచారి పరామర్శించారు.
నర్సింహుడు సినిమాను జిల్లాలో విడుదల చేయకపోతే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీ ఆర్ సినిమాలను నిషేధిస్తామని విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ల సంఘం హెచ్చరించింది. జిల్లాలో నర్సింహుడు సినిమాను విడుదల చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని విశాఖపట్నం జూనియర్ ఎన్టీ ఆర్ అభిమానుల సంఘం హెచ్చరిస్తోంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications