సచిన్‌ మునుపటిలా ఆడలేడు: చాపెల్‌

ముంబాయి: భారత బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ మునుపటి ఫామ్‌లోకి రావడమనేది సందేహమేనని భారత క్రికెట్‌ కోచ్‌ గెగ్‌ చాపెల్‌ అన్నారు. తిరిగి ట్రాక్‌లోకి రావడానికి సచిన్‌ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తాడని ఆయన చెప్పారు. సచిన్‌ మొదటి నాళ్లలో లాగా ఆడుతాడని తాను అనుకోవడం లేదని, మార్పు సహజమని, 18 యేళ్ల వయస్సులో ఉన్నప్పటికీ 30 యేళ్ల వయస్సు దాటినప్పటికీ మనిషిలో తేడా ఉంటుందని ఆయన అన్నారు. ఆ విధమైన మార్పు సహజమని ఆయన అన్నారు.

కెరీర్‌లో ప్రతి ఒక్కరూ విభిన్న దశలను చవి చూస్తారని, దాదాపు 15 యేళ్లుగా సచిన్‌ అడుతున్నాడని, ఈ పదిహేనేళ్లు అసాధారణమైవనని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నాడని, గాయాలపాలయ్యాడని, జట్టులో తన పాత్ర ఏమిటనే విషయంలో సచిన్‌ కొంత సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని చాపెల్‌ అన్నారు.

ౌవనంలో లేని కొన్ని కొన్ని విషయాలు సచిన్‌ జీవితంలో చోటు చేసుకుంటాయని, అయితే వాటిని సచిన్‌ ఆహ్వానించడం అవసరమని, తద్వారా జట్టులో సచిన్‌ అర్థవంతమైన పాత్ర నిర్వహించాల్సిన ఉంటుందని, అందుకు సచిన్‌ సిద్ధపడతాడని తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు. సచిన్‌ వంటి ప్రమాణాలు గల ఆటగాడితో కలిసి పని చేయడం గొప్ప గౌరవమని చాపెల్‌ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+