వరంగల్ జిల్లాలో నలుగురు నకిలీల అరెస్టు
వరంగల్: నలుగురు నకిలీ నక్సలైట్లను వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నక్సలైట్ల పేరు నకిలీ నక్సలైట్లు బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. వీరి నుంచి పోలీసులు నాటు బాంబులను, బొమ్మ పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో జోగు శ్రీను, జోగు చంద్రయ్య, మేక సుదర్శన్, ముత్తన్న ఉన్నారు. వీరి నుంచి పోలీసులు 30 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిలో ఇద్దరు మాజీ నక్సలైట్లు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications
