గుంటూరు జిల్లాలో
గుంటూరు: గుంటూరు జిల్లాలో నక్సలైట్లు ఇద్దరిని హత్య చేశారు. గత నాలుగు రోజులుగా ముగ్గురిని నక్సలైట్లు హత్య చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామం మాజీ సర్పంచ్ పూరి జానయ్యను నక్సలైట్లు నరికి చంపారు. ఈ సంఘటనతో గుంటూరు జిల్లాలోని పల్నాడులో కాంగ్రెస్ నాయకులు ఆందోళనలకు గురవుతున్నారు. ఈ జానయ్య కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. దావులపల్లిలో ఇన్‌ఫార్మర్ పేరుతో ఒక వ్యక్తిని నక్సలైట్లు కాల్చి చంపారు.
సంచనం కోసమే నక్సలైట్లు హత్యలు చేస్తున్నారని గుంటూరు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ జితేంద్ర అన్నారు. నక్సలైట్లు ఎస్‌సిలను, ఎస్‌టిలను, ప్రజాప్రతినిధులను చంపుతున్నారని ఆయన అన్నారు. ప్రజలు నక్సలైట్లను ఎదుర్కొని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
