తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద రోజా ఆందోళన

తిరుపతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రి వద్ద సినీనటి, తెలుగుదేశం నాయకురాలు రోజా ఆందోళనకు దిగారు. చికిత్స పూర్తి కాకుండా రోగులను డిశ్చార్జ్‌ చేసినందుకు నిరసనగా ఆమె ఆందోళనకు దిగారు. నగరి నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం కార్యకర్తలపై ప్రత్యర్థులు దాడి చేశారని, ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారని, వీరు రుయా ఆస్పత్రిలో చేరారని రోజా వివరించారు. అయితే చికిత్స చేయకుండానే ఒక వ్యక్తిని సుధాకర్‌ రెడ్డి అనే వైద్యుడు డిశ్చార్జ్‌ చేశారని ఆమె ఆరోపించారు. సుధాకర్‌ రెడ్డి డాక్టరా లేదా కాంగ్రెస్‌ ఏజెంటా అని ఆమె అడిగారు. రోజా ఆందోళనకు దిగడంతో అతడ్ని వైద్యులు తిరిగి ఆస్పత్రిలో చేర్చుకున్నారు. దీంతో ఆమె ఆందోళన విరమించారు.

ఈ విషయాన్నంతా ఆస్పత్రి సూపరింటిండెంట్‌కు వివరించానని, అయితే ఏ విషయమూ తనకు ఇంత వరకు తెలియదని సూపరింటిండెంట్‌ చెప్పారని ఆమె అన్నారు. తాను రోగిని అర్థాంతరంగా డిశ్చార్జ్‌ చేయడంపై వైద్యులను ప్రశ్నించగా, పడకలు లేవని చెప్పారని, అయితే అస్పత్రిలో చేరిన కొద్దిమందికి సీరియస్‌ వ్యాధులేమీ లేవని ఆమె చెప్పారు. సీరియస్‌గా లేని రోగులకు పడకలు ఇచ్చి, సీరియస్‌గా ఉన్న వ్యక్తులను డిశ్చార్జ్‌ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+