610 జీవో అమలుకు నిరసనగా ఉద్యమం: వెంకటేష్
హైదరాబాద్: తెలంగాణకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సవరించడానికి 610 జీవో అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాయలసీమ ఐక్య పోరాట వేదిక నాయకుడు టి.జి. వెంకటేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. 610 జీవో అమలు పేరుతో అమాయకులైన పోలీసులను బలి చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. జీవం కోల్పోయిన 610 జీవోకు జీవం పోయడం సరి కాదని ఆయన అన్నారు.
610 జీవోను అమలు చేయడానికి పూనుకుంటే తాము పెద్ద యెత్తున ఆందోళన చేపడతామని ఆయన అన్నారు. తాము ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని కోరుకోవడం లేదని, అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తే తాము ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. విదేశాల్లో ఐదేళ్లుంటే పౌరసత్వం ఇస్తున్నారని, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారని, అటువంటిది 20, 30 యేళ్లుగా తెలంగాణలో ఉంటున్నవారిని పంపిస్తామనడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications