రెండో ఎస్సార్సీతోనే తెలంగాణ: కేశవరావు
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (రెండో ఎస్సార్సీ) ద్వారా సాధ్యమవుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు తనకు మంచి మిత్రుడని, తెలంగాణ సాధనకు కెసి ఆర్ వేరే మార్గం ఎంచుకున్నారని ఆయన అన్నారు. తాము తరుచూ కలుసుకుంటూనే ఉంటామని, తాము కలిసినప్పుడల్లా రాజకీయాల గురించి నిర్మాణాత్మకంగా చర్చించుకుంటామని ఆయన అన్నారు.
సినీనటి విజయశాంతి విమర్శలపై ఆయన ఆచితూచి మాట్లాడారు. పెద్దలను గౌరవించడం నేర్చుకుందామని ఆయన అన్నారు. పత్రికల్లో చూశానని, ప్రజలను గౌరవించడం నేర్చుకుందామని ఆయన అన్నారు. తెలంగాణ రావాలని అందరికీ ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
