పెనుకొండ అభ్యర్థి మరుగుజ్జు మల్లేష్ చందాలు
హైదరాబాద్: పెనుకొండ శాసనసభా ఎన్నికల ప్రచారం కోసం మరుగుజ్జు మల్లేష్ గురువారంనాడు హైదరాబాద్‌లో విరాళాలు వసూలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా మరుగుజ్జుల తరఫున పెనుకొండ ఉప ఎన్నికలో మల్లేష్ నామినేషన్ దాఖలు చేశారు. తమకు ఎన్నికల ప్రచారం కోసం డబ్బులు అవసరమని, అందుకే విరాళాలు వసూలు చేస్తున్నామని మల్లేష్ చెప్పారు. ఆయనతో పాటు మరుగుజ్జులు మరికొంత మంది హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా నిలబడి విరాళాలు తీసుకున్నారు.
తాము మనుషులేమనని, తమకు కూడా గుర్తింపు ఉండాలని మల్లేష్ అన్నారు. తమకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తమను వాడుకుని మోసం చేసిందని ఆయన విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే తమను మరిచిపోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
