16 అసెంబ్లీ స్ధానాల ఎన్నికల ఫలితాలు రేపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో జరిగిన ఒక లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌటింగ్ ఆదివారంనాడు జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని షిమోగా పార్టీమెంటు స్థానికి, గోవాలో ఐదు, యుపిలో నాలుగు, హర్యానాలో మూడు, కేరళలో రెండు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్‌లలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఈ నెల 2న ఉప ఎన్నికలు జరగగా, ఆదివారంనాడు కౌటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ నియోజకవర్గానికి కూడా కౌటింగ్ జరుగుతుంది. బిజెపినుంచి రాజీనామా చేసి సమాజవాది పార్టీలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప మళ్ళీ షిమోగా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. హర్యానా ముఖ్యమంత్రి బూపీందర్‌సింగ్ హూడా కిల్లోయి నుంచి అసెంబ్లీలో ప్రవేశించడానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.












Click it and Unblock the Notifications