IPL 2026: కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్.. పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ జైత్రయాత్రకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా కొనసాగుతున్న పంజాబ్‌కు రాజస్థాన్ రాయల్స్ ఓటమి రుచిని చూపించింది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.

డోనోవన్ ఫెరీరా(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) అద్వితీయమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించారు. అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ చెత్త బౌలింగ్‌తో పంజాబ్ ఓటమికి కారణమయ్యారు.

కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్..

223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/36) మూడు వికెట్లతో సత్తా చాటినా..అర్ష్‌దీప్ సింగ్(1/68), లాకీ ఫెర్గూసన్(0/57) ధారళంగా పరుగులిచ్చారు. దాంతో పంజాబ్ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు.

అంతకు ముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(44 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 59), మార్కస్ స్టోయినీస్(22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. కూపర్ కన్నాల్లీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), ప్రియాన్ష్ ఆర్య(11 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 29) దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్ చెరో వికెట్ తీయగా.. యశ్‌రాజ్ పునియా(2/41) రెండు వికెట్లు పడగొట్టాడు.

IPL 2026 Arshdeep Singh and Lockie Ferguson s Expensive Overs Cost Punjab Kings against Rajasthan Royals


అదరగొట్టిన డొనోవన్, శుభమ్‌ దూబే..

223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో 3 ఓవర్లలోనే రాజస్థాన్ 50 పరుగులు చేసింది. కానీ హాఫ్ సెంచరీకి చేరువైన వైభవ్ సూర్యవంశీ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(16)తో కలిసి యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు.

అయితే ఈ జోడీని యుజ్వేంద్ర చాహల్‌ను విడదీసాడు. ధ్రువ్ జురెల్‌(16)ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చి చాహల్.. తన మరుసటి ఓవర్‌లో హాఫ్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. తన చివరి ఓవర్‌లో దూకుడుగా ఆడిన కెప్టెన్ రియాన్ పరాగ్‌ను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ వైపు మలుపు తిప్పాడు.

మలుపు తిప్పిన శుభమ్ దూబే, ఫెరీరా..

చివరి 36 బంతుల్లో పంజాబ్ విజయానికి 72 పరగులు అవసరం కావడం.. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా బరిలోకి దిగిన శుభమ్ దూబే, డోనవన్ ఫెరీరా అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగారు. అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్‌లను చితక్కొట్టారు. ముఖ్యంగా ఫెరీరా భారీ సిక్స్‌లు బాది రాజస్థాన్ రాయల్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. శుభమ్ దూబేతో కలిసి అతను ఐదో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+