మున్సిపాలిటీలకు పరోక్ష ఎన్నికలు
హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరోక్ష ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని లోక్‌సత్తా ప్రకటించింది. ప్రతిపక్షపార్టీలు వ్యతిరేకిస్తున్నా మునిసిపల్ చైర్మన్లకు, కార్పొరేషన్ల మేయర్లకు పరోక్ష ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications