బీహార్ ఎన్నికల్లో మార్క్సిస్టుల మంత్రాంగం
కోల్‌కత: బీహార్‌లో నవంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆర్జెడి, ఎల్. జె. పిి కలిసికట్టుగా పోటీ చేయాలని సిపి ఐ ( ఎం) పిలుపునిచ్చింది. పార్టీల మధ్య సయోధ్య కుదర్చటానికి ప్రయత్నం చేస్తున్నామని సి. పి. ఐ (ఎం) శనివారం తెలిపింది. మతతత్వ ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్, ఆర్జెడి, ఎల్. జె. పి కలిసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని పాలిట్‌బ్యూరో సభ్యుడు జ్యోతిబసు సూచించారు.
గత ఎన్నికలలో బద్ధశత్రువులైన లాలూ ప్రసాద్, రామ్‌విలాస్ పాశ్వాన్‌లు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించారు. బీహార్ ఎన్నిక ల అంశం ప్రధాన అజెండాగా కోల్‌కతలో పార్టీ కేంద్ర కమిటీ మూడు రోజుల సమావేశంలో చర్చిస్తుందని, గత ఎన్నికలలో మతతత్వ శక్తులు ఐకమత్యం కావాలని మార్క్సిస్టులు పిలుపునిచ్చినా ఫలితం లేకపోయిందని ఈసారి కూడా అదే అజెండాతో ముందుకెళతామని మరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు.












Click it and Unblock the Notifications