అద్వానీ క్షమాపణకు సాధువుల డిమాండ్
అయోధ్య: బాబ్రీమసీదు కూల్చివేతకు క్షమాపణ చెబుతూ పాకిస్తాన్‌లో ప్రతిపక్ష నేత అద్వాని చేసిన ప్రకటనపై అయోధ్యలోని సాధువులు, ధర్మాచార్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిజెపి అధ్యక్ష పదవికి అద్వాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి రామ్‌జానకి మందిరంలో శనివారం మతపెద్దల మధ్య జరిగిన సమావేశంలో అద్వాని రాజీనామా డిమాండ్‌ను లేవదీశారు. బాబ్రీ మసీదు వ్యవహారంపై అద్వాని క్షమాపణ చెప్పాలని గతంలోనే వీరు డిమాండ్ చేశారు. హిందువుల ప్రయోజనాలను పరిరక్షించటం కోసం బిజెపి ఏర్పడిందని తన లక్ష్యాన్ని మరచి ముస్లిమ్ వర్గాల మెప్పు కోరటానికి ప్రయత్నిస్తున్నదని జగద్గురు రామానుజాచార్య స్వామి మాధవాచార్య నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు.












Click it and Unblock the Notifications