జింక వేట కేసులో కోర్టుకు హాజరైన సల్మాన్
జైపూర్: అరుదైన బ్లాక్ బక్ జాతి జింకలను అక్రమంగా వేటాడి హతమార్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సతీష్ షా శనివారం జోధ్‌పూర్‌లోని స్థానిక కోర్టులో హాజరయ్యారు. మరో 8 మంది సహ నిందితులతో ప్రధాన మెజిస్ట్రేట్ బ్రిజెంద్ర కుమార్ జైన్ ఎదుట హాజరైన సల్మాన్, సతీష్‌లు సెప్టెంబరు 26, 27 రాత్రుల్లో వన్య మృగాలను తాము వధించలేదని చెప్పారు. ముద్దాయిల వివరణ విన్న తర్వాత తీర్పు జులై 16న ప్రకటిస్తామని మెజిస్ట్రేట్ అన్నారు. ఒక చిత్రం షూటింగ్ సందర్భంగా రెండు జింకలను హతమార్చారని సల్మాన్, సతీష్‌తో పాటు మరో 8 మందిపైన బిష్నోయి గిరిజన వర్గం మథానియా స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications