పరోక్షం రాజ్యాంగ విరుద్ధం కాదు: కోనేరు
విజయవాడ: మున్సిపాలిటీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం కాదని మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఆగస్టు చివరివారంలో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ జరుగుతాయని ఆయన ఆదివారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓటమి భయంతోనే తాము మున్సిపాలిటిలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. ప్రజల ఆమోదం మేరకే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.
మున్సిపాలిటీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో జరపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సభ్యులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, తదితరులు హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ అర్థం లేని విమర్శలు చేస్తోందని వారు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications