చార్మినార్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో గల చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌పై నుంచి దూకి ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. చార్మినార్‌పైకి ఎక్కడానికి మూడేళ్ల క్రితం అనుమతిచ్చిన తర్వాత దానిపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం ఇదే తొలిసారి.
భర్తతో నెలకొన్న వివాదం కారణంగా ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన శాలిని అనే యువతి ఈ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇదిలావుంటే, ఆమె భర్త భార్గవ్ తన భార్య కనిపించడం లేదంటూ సంజీవరెడ్డినగర్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశాడు. వీరిద్దరికి గత నెలలోనే వివాహం జరిగింది. భార్గవ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.












Click it and Unblock the Notifications