ఆటపాటల మంత్రిగాఎమ్మెస్ బాధ్యతలు
హైదరాబాద్:క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఎం సత్యనారాయణ రావుశనివారం పదవీ బాధ్యతలుస్వీకరించారు. క్రీడా శాఖ ఉన్నతాధికారి చిత్రారామచంద్రన్ పుష్పగుచ్ఛంతోఆయన స్వాగతం పలికారు. దేవాదాయశాఖ ఆలయ భూముల అక్రమ అమ్మకాల కుంభకోణందరిమిలా రాజీనామాకుసిద్ధపడిన ఆ శాఖ మంత్రి ఎంసత్యనారాయణరావును, ముఖ్యమంత్రిసముదాయించి ఆయన శాఖను మార్చారు.ఆలయ భూముల అమ్మకంపై విచారణపూర్తయ్యేంత వరకు దేవాదాయ శాఖ గురించిమాట్లాడబోననిఆయన అన్నారు. విలేకరులతో ఆయనఆచితూచి మాట్లాడారు. నిజానిజాలుతేలేవరకు తనకు ఒక చిన్న శాఖనుకేటాయించమని తానే సిఎంనుకోరానన్నారు. ఐదు దశాబ్దాల రాజకీయజీవితంలో తన మీద ఎటువంటి ఆరోపణలురాలేదని, చివరి దశలో రావడం బాధ కలిగించిందన్నారు.












Click it and Unblock the Notifications