వెంకటేశ్వర్లు నియామకాలన్నీ రద్దు: కొత్త కమీషనర్
శ్రీకాళహస్తి: మాజీ దేవాదాయ కమీషనర్ వెంకటేశ్వర్లు జరిపిన ఉద్యోగ నియామకాలన్నిటినీ రద్దు చేయనున్నట్లు కొత్త దేవాదాయ కమీషనర్ ప్రసాద్ చెప్పారు. ఆయన ఆదివారంనాడు శ్రీకాళహస్తిని సందర్శించి, అక్కడి నిర్వహణ పనులను పరిశీలించారు. నిర్వహణ తీరు పట్ల ఆయన దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌పైనా, సిబ్బందిపైనా తీవ్రంగా మండిపడ్డారు. పనుల తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేవాదాయ శాఖలో మాజీ కమిషనర్ వెంకటేశ్వర్లు జరిపిన ఉద్యోగ నియామకాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించి వెంకటేశ్వర్లు నియామకాలు జరిపారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు రాజీనామాకు దారి తీసిన ఆలయ భూముల అక్రమ విక్రయం కుంభకోణం కూడా వెంకటేశ్వర్లు పుణ్యమేననే విమర్శలున్నాయి. ఆలయ భూముల అక్రమ విక్రయాల వ్యవహారంలో వెంకటేశ్వర్లు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications