పోలీసు హింసకు మతితప్పిన స్వర్ణకారుడు
హైదరాబాద్: పోలీసులు దొంగతనం మోపి పెద్ద యెత్తున లంచం అడగడంతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఒక వ్యక్తి మతిస్థిమితం తప్పాడు. ఈ విషయాన్ని శివకుమారాచారి భార్య హైదరాబాద్ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం- మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివకుమారాచారి అనే స్వర్ణకారుడిపై హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీసులు దొంగతనం కేసు మోపారు. కేసు మాఫీ చేసేందుకు సబ్ ఇన్‌స్పెకర్ (క్రైమ్) శంకర్ యాదవ్ లక్ష రూపాయల లంచం అడిగాడు. నిందితుడు 30 వేల రూపాయలు చెల్లించాడు. అయినా ఊరుకోకుండా శివకుమారాచారిని అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను మతిస్థిమితం తప్పాడు.
ఇదిలా వుంటే, ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని డిసిపి సంజయ్ హామీ ఇచ్చారు. శివకుమారాచారి సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications