ఆ ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించండి: హైకోర్టు
హైదరాబాద్: కృష్ణా జిల్లా కైకలూరు కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజా రామచందర్‌ను కఠినంగా శిక్షించాలని హైకోర్టు సూచించింది. తప్పుడు సమాచారం ఇచ్చి లబ్ది పొందారనే ఆరోపణపై రాజా రామచందర్‌పై కృష్ణా జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు మంగళవారం ఆ సూచన చేసింది.
శస్త్రచికిత్సకు ఖర్చు అయ్యాయంటూ రాజా రామచందర్ ఆరు లక్షల రూపాయలు తీసుకున్నారని, అయితే రాజా రామచందర్ శస్త్రచికిత్స చేయించుకోకుండా ఆ డబ్బులు తీసుకున్నారని, అందుకు తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. రాజా రామచందర్ విషయంలో ఎథిక్స్ కమిటీ నివేదికను అమలు చేయాలని హైకోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications