ముస్లిమ్ రిజర్వేషన్లతో పెను ముప్పు: వెంకయ్య
న్యూఢిల్లీ: ముస్లిమ్‌లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్ని రంగాల్లోనివారికి పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారతీయ జనతా యువమోర్చా మంగళారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముస్లిమ్ రిజర్వేషన్లను ప్రభుత్వాలు వెనక్కి తీసుకునేవరకు పోరాడుతామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని ఆయన అన్నారు.
కొన్ని రాష్ట్రాలకు, విద్య ఉద్యోగ రంగాలకు పరిమితమైన ముస్లిమ్ రిజర్వేషన్లు అన్ని రంగాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించి దేశ విభజనకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లో రిజర్వేషన్లు చేజిక్కించుకున్న తర్వాత ముస్లిమ్‌లు దేశవిభజనకు డిమాండ్ చేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ముస్లిమ్‌లకు మతప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పిస్తోందని ఆయన అన్నారు. దీన్ని ఇప్పుడే ఎదిరించకపోతే దేశానికి పెను ప్రమాదం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు కల్పించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications