వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సిరెడ్డిహత్యకేసులో నలుగురు అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నర్సిరెడ్డి హత్యకేసుకు సంబంధించి పోలీసులు నలుగురినిఅరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకితీసుకున్నవారిని మావోయిస్టు యాక్షన్‌టీమ్‌ సభ్యులు భగవంత్‌,రమాకాంత్‌, నర్సప్ప, యాదయ్య,రజితలుగా గుర్తించినట్లు సమాచారం.మొదట వారిని శ్యాం, సత్యం, రజిత,రజనీకాంత్‌లుగా గుర్తించారు. అయితేరజితను సికేపల్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌వదిలేసినట్లు వార్తలువెలువడుతున్నాయి. రజితనువదిలేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నుసస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. హత్యకేసులో అనుమానితుడైన మరోవ్యక్తిపరారీలో ఉన్నాడు. నర్సిరెడ్డి హత్యకేసుకు సంబంధించి అరెస్టయిన వారికిఏమైనా హాని జరిగితే కల్వకుర్తి ఎమ్మెల్యే జూపల్లికృష్ణారావు బాధ్యత వహించాలని మావోయిస్టులుహెచ్చరించారు.

ఐదుగురునక్సలైట్లలో ఒక నక్సలైట్‌ తనతోపాటు ఒక వ్యక్తిని తీసికెళ్లి నల్లమలఅడవులకు వెళ్లిన తర్వాత ఒకలేఖను ఆ వ్యక్తికి ఇచ్చి తిరిగి వెనక్కి పంపినట్లుచెబుతున్నారు. అరెస్టయిన నలుగురునక్సలైట్లకు ఏమైనా జరిగేశాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావుదేబాధ్యత అని ఆ లేఖలో హెచ్చరించినట్లుసమాచారం. భద్రతావైఫల్యం వల్లనే నర్సిరెడ్డి హత్యజరిందని ఆయన సన్నిహితులుఆరోపిస్తున్నారు. కానీ అదనపు భద్రతను ఆయనే వద్దన్నారనిపోలీసులు అంటున్నారు. మావోయిస్టులుఆరోపిస్తున్నట్టుగా నర్సిరెడ్డికి కల్లువ్యాపారంతో సంబంధాలు లేవని,అనవసరంగా నర్సిరెడ్డిని కాల్చి చంపారని ఆయనసన్నిహితులు వాపోయారు. నలుగురునిందితుల అరెస్టును పోలీసులుధృవీకరించడం లేదు.నిందితులను అరెస్టు చేయలేదనిమహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసుసూపరింటిండెంట్‌ (యస్పీ) విక్రమ్‌ సింగ్‌మీడియా ప్రతినిధులతో అన్నారు.

నర్సిరెడ్డిపై దాడికి ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెదకొత్తపల్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు చెప్పారు. నర్సిరెడ్డి హత్య గురించి తెలిసిన వెంటనే తాము వాహనాల తనిఖీ ప్రారంభించామని, ఈ సందర్భంలో నలుగురు వ్యక్తులు రెండు వాహనాలపై కొల్లాపూర్‌ వైపు నుంచి నాగర్‌కర్నూలు వైపు వెళ్తూ తమను చూసి వాహనాలను చూసి పారిపోయారని ఆయన చెప్పారు. ఇందులో ఒక మహిళ ఉందని ఆయన చెప్పారు. ఇద్దరు రోడ్డుకు ఒక వైపు, మరో ఇద్దరు మరోవైపు పారిపోయారని ఆయన చెప్పారు. పారిపోతున్నవారిపై కాల్పులు జరపడానికి జనం అడ్డు వచ్చారని ఆయన చెప్పారు. వారు వదిలి వెళ్లిన వాహనాలను తనిఖీ చేయగా నర్సిరెడ్డి గన్‌మన్‌కు చెందని కార్బయిడ్‌ ఆయుధం ఉందని ఆయన చెప్పారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న హీరోహోండా మహబూబ్‌నగర్‌ జిల్లా దామగిరి మండలం కనుకుర్తి గ్రామానికి చెందిన కె. జగదీశ్‌దని సమాచారం.

అరెస్టయినవారినుంచి పోలీసులు దాడిలో మృతి చెందిననర్సిరెడ్డి గన్‌మన్‌ శ్రీనివాస్‌కు చెందిన కార్బయిన్‌ను స్వాధీనంచేసుకున్నారు. అలాగే ఒక సుజుకీని,హోండాను కూడా వారు స్వాధీనంచేసుకున్నారు. శాసనసభ్యుడు నర్సిరెడ్డికి భద్రత కల్పించడంలో విఫలమయ్యారంటూ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రామి రెడ్డిని, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌లను సస్పెండ్‌ చేశారు. డియస్‌పి రాములను డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించినట్లు ఐజి మీనా చెప్పారు. నర్సిరెడ్డి భద్రత విషయంలో తాము నిర్లక్ష్యం వహించలేదని సస్పెండ్‌ అయిన అధికారులంటున్నారు.

నర్సిరెడ్డి హత్య జరిగేసమయానికి ఇద్దరు కానిస్టేబుళ్లతోకలిసి తాను అక్కడ బందోబస్తుకువెళ్తున్నట్లు సస్పెండైన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. తమవద్ద ఆయుధాలు లేవని, ఆ సమయంలోతాము అక్కడ ఉండి వుంటే తాము కూడాబలై ఉండేవాళ్లమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X