నక్సల్స్‌కు పోలీసు తడాఖా చూపిస్తాం: డిజిపి
హైదరాబాద్: నక్సలైట్లకు పోలీసు తడాఖా చూపిస్తామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్ అన్నారు. ఇక మాటలుండవని, చేతలే ఉంటాయని ఆయన అన్నారు. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నక్సలైట్లు మతిలేని పనులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇక నక్సల్స్‌తో చర్చలు ఉండవని, చర్యలే వుంటాయని ఆయన అన్నారు. నక్సలైట్లపై నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు తగిన భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
