విమర్శకులు అభివృద్ధినీ చూడాలి: వుల్ఫోవిజ్‌

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌: ప్రపంచబ్యాంక్‌ను విమర్శిస్తున్నవారు తమ కార్యక్రమాల ద్వారా జరుగుతున్న అభివృద్ధిని కూడా చూడాలని ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు పాల్‌ వుల్ఫోవిజ్‌ హైదరాబాద్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

మహిళలందరిలోనూ చైతన్యస్ఫూర్తి కలగాలని ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు పాల్‌ వుల్ఫోవిజ్‌ అన్నారు. ఆయన గురువారంనాడు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మూడు గ్రామాలను సందర్శించి సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ల మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. విజయం సాధించిన మహిళలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోస్గి, ముస్తిఫా, కొత్తూరు గ్రామాలను ఆయన సందర్శించారు. ముస్తిఫా గ్రామంలో ఆయన నేరుగా ఐదుగురు మహిళల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు.

అనంతరం ఆయన హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లోని జూబిలీహాల్‌లో ఆయన సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ల మహిళలతో జరిగిన ఇష్టాగోష్ఠి సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇష్టాగోష్ఠిలో సమావేశంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు. మహిళలు సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌లు తమ జీవితాల్లో తెచ్చిన మార్పును వివరించారు. సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌లు తెచ్చిన అతి ముఖ్యమైన మార్పును ఎవరైనా చెప్పగలరా అని వుల్ఫోవిజ్‌ అడిగారు. తాను సాధించిన ప్రగతిని ఒక మహిళ వివరించింది.

వడ్డీ వ్యాపారుల చేతుల్లో నలిగిపోయిన గ్రామీణులకు మహిళల సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌లు ఎంతో తోడ్పడుతున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి ఇందిరాగాంధీ ఎన్నో చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారనే విషయం సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ల మహిళల మాటల నుంచి అర్థమవుతోందని ఆయన అన్నారు. తీసుకున్న వడ్డీలను సక్రమంగా చెల్లించే క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఒక్కో మండలానికి మూడు కోట్ల రూపాయలు అప్పు ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఉద్యమంగా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ల ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ఎదిగిందని వుల్ఫోవిజ్‌ అన్నారు. "15 ఏళ్ల క్రితం దీన్ని ప్రారంభించినప్పనడు చదువురాని మేం ఏం సాధించగలమనే అవిశ్వాసం మీలో ఉండి ఉంటుంది. కానీ సాధించి చూపించారు అని ఆయన సెల్ఫ్‌హెల్ఫ్‌ గ్రూప్‌ మహిళతో అన్నారు. " ఇప్పుడు నడక మీరు పురుషులకు నేర్పే స్థితిలో ఉన్నారు అని ఆయన మహిళలను ఉద్దేశించి అన్నారు. "మీ పిల్లలను బాగు చేసుకుంటూ మీరు ముందుకు నడవడం హర్షదాయకమని ఆయన అన్నారు. సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెరిగాయని, ఇది భారతదేశానికి ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+