తెలంగాణపై తగిన నిర్ణయం: శివరాజ్ పాటిల్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను సానుభూతితో పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ చెప్పారు. రాజ్యసభలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు. తెలంగాణపై తగిన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఏ విధమైన తీర్మానం తమకు అందలేదని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ అనేది సంక్లిష్ట సమస్య అని, అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించే, వ్యతిరేకించే అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వెనకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని వర్తింపజేస్తామని, తెలంగాణతో పాటు ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి అది దోహదపడుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
